సారథి స్టూడియోలో అల్లూరి సీతరామరాజు…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఆర్ ఆర్ ఆర్ షూట్ కి వచ్చేశాడు. జక్కన్న చెక్కుతున్న ఈ కావ్యం లేటెస్ట్ షెడ్యూల్ సారథి స్టూడియోలో జరుగుతుంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ జాయిన్ అయ్యాడు. కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్న రామ్ చరణ్ మళ్లీ రామరాజు అవతారంలోకి వచ్చేశాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అవతారంలోకి రావడంతో పాటు, మరో గుడ్ న్యూస్ కూడా మెగా అభిమానుల్లో జోష్ నింపింది. రామ్​చరణ్ తేజ్​ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు. ఇన్​స్టాలో చెర్రీ ఫాలోవర్స్ సంఖ్య 4 మిలియన్లకు చేరుకుంది. మెగాస్టార్​ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్​.. చాలా తక్కువ టైంలోనే భారీ మార్కెట్​ తో పాటు సోషల్ మీడియా ఫాలోవెర్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు.

Bheem For Ramaraju - Ramaraju Intro - RRR(Telugu) | NTR, Ram Charan, Ajay Devgn | SS Rajamouli