సాయి ధరమ్ తేజ్ పెళ్లి వెనుక మెగా ప్లాన్?

మెగా ఫ్యామిలీలో ఎలాంటి ఈవెంట్స్ జరిగినా కూడా మెగాస్టార్ నిర్ణయం లేకుండా స్టార్ట్ కాదనేది అందరికి తెలిసిందే. మెగా హీరోలు కూడా చాలా వరకు వారి సినిమాల సెలక్షన్స్ విషయంలో మెగాస్టార్ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇక చాలా రోజుల తరువాత మెగాస్టార్ పై పెద్ద బాధ్యతలు పడ్డాయి. ఒకవైపు నిహారిక పెళ్లి మరోవైపు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లి.

ముందు నిహారిక పెళ్లి అయిన తరువాత సాయి ధరమ్ తేజ్ పెళ్లి విషయంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చూస్తున్నారట. ముందుగా సాయి ధరమ్ తేజ్ ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధమైనట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ వట్టి పుకార్లని అర్ధమవుతోంది. ఎందుకంటే మెగా హీరో పెళ్లి ఫిక్స్ కావడానికి ప్రధాన కారణం మెగాస్టార్ అని తెలుస్తోంది. ఆయనకు తెలిసిన మిత్రుడి కుటుంబం నుంచి అమ్మాయిని ఫిక్స్ చేసినట్లు టాక్. వచ్చే డిసెంబర్ లో నిహారిక పెళ్లి అనంతరం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేయాలని మెగాస్టార్ ఒక ప్లాన్ వేసినట్లు సమాచారం.