మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అల్లు పేరుతో ఒక సినీ స్డూడియో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నిర్మాణం పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక ఆయన బాటలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా నడవనున్నట్లు తెలుస్తోంది. అసలైతే మెగాస్టార్ చాలా కాలంగా భారీ స్థాయిలో ఫిల్మ్ స్టూడియో కట్టాలని అనుకుంటున్నారు.
గతంలో చాలా సార్లు ఈ విషయంపై కథనాలు వచ్చినప్పటికీ అఫిషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సారి మెగాస్టార్ పక్కా ప్లాన్ తో స్టూడియో బిజినెస్ లోకి దిగనున్నట్లు టాక్ వస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పది ఎకరాల విస్తీర్ణంలో నెవర్ బిఫోర్ అనేలా మెగా స్టూడియోను నిర్మించాలని ప్లాన్ వేస్తున్నట్లు టాక్. అయితే… గతంలో వైజాగ్ లో స్టూడియో కట్టాలనుకున్నారు. కానీ ఎందుకో మనసు మార్చుకున్నారట. ఇదివరకే వర్క్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తోంది. రెగ్యులర్ ఫిల్మ్ స్టుడియోలా కాకుండా ఫ్లోర్లు ఉండేవిధంగా ప్లాన్ చేస్తున్నారట. నాలుగు ఫ్లోర్లతో సినిమా షూటింగ్లకు, రియాలిటీ షోలకు అనువుగా ఉండేలా సకల సౌకర్యాలతో ఈ ఫ్లోర్స్ నిర్మిస్తారని సమాచారం. ఇక ఈ విషయంలో మెగాస్టార్ త్వరలోనే అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నట్లు టాక్.