హైదరాబాద్‌కు చెందిన ఇరవై ఏళ్ల నీలకంఠ భాను ప్రకాష్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా అవతరించాడు. ఆ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా అతను ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఈ వారం లండన్‌లో మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో జరిగిన మెంటల్ కాల్యుక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భాను భారతదేశానికి తొలి స్వర్ణం సాధించాడు.
యుకె, జర్మనీ, యుఎఇ, ఫ్రాన్స్ గ్రీస్ మరియు లెబనాన్ సహా 13 దేశాల నుండి 30 మంది పోటీలో పాల్గొన్నారు. అయితే భాను లెబనీస్ పోటీదారు కంటే 65 పాయింట్లు ముందంజలో ఉండగా.. యుఎఇ నుండి ఒకరు మూడవ స్థానంలో ఉన్నారు. మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ మొదటిసారి 1998 లో జరిగింది. ప్రకాష్ తన ఐదేళ్ల వయసులోనే SIP అబాకస్ ప్రోగ్రామ్ లో పట్టు సాధించేందుకు అడుగులు వేశాడు. SIP అకాడమీ అందించే గ్రాండ్ మాస్టర్ ప్రోగ్రామ్ అబాకస్ యొక్క తొమ్మిది స్థాయిలను పూర్తి చేశాడు. అతను అంతర్జాతీయ అబాకస్ ఛాంపియన్ ’13 మరియు నేషనల్ అబాకస్ ఛాంపియన్ ’11 మరియు ’12 లను కూడా గెలుచుకున్నాడు.