‘బిగ్ బాస్’ షోను అడ్డుకోవడానికి ఎంత దూరమైనా వెళతా!!

తెలుగులో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ షోలో ఇప్పటికే కంటెస్టెంట్స్ మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఇక బయట నుంచి కాంట్రవర్సీలు పెద్దగా స్టార్ట్ అవ్వలేదు. కానీ తమిళ్ లో నాలుగవ సీజన్ ఇంకా మొదలు కాకముందే ఒక హీరోయిన్ షోను అడ్డుకుంటానని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆ బ్యూటీ మరెవరో కాదు. తమిళ్ బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొన్న మీరా మిథున్.

గత సీజన్ లో దర్శకుడు చేరన్ తన నడుమును అసభ్యంగా తాకాడాని అప్పుడు కమల్ హాసన్ తనకు ఏ మాత్రం సపోర్ట్ చేయలేదని నటి చాలా సందర్భాల్లో ఆరోపణలు చేసింది. వీడియోను కూడా ఎడిట్ చేసి తన ఆరోపణలను అబద్ధం చేశారని తెలిపింది. ఇక ఈ సారి బిగ్ బాస్ 4 స్టార్ట్ కాకుండా చేస్తానని చెప్పినా మీరా తనకు న్యాయం జరిగాలని అందుకోసం ఎంత దూరమైనా వెళతానని హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.