Megastar: సినీ కార్మికుల‌కు ఉచితంగా క‌రోనా టీకా: మెగాస్టార్ చిరంజీవి

Megastar: మెగాస్టార్ చిరంజీవి తాజాగా నాగార్జున న‌టించిన వైల్డ్‌డాగ్ చిత్ర విజ‌యోత్స‌వంలో భాగంగా అప్రిసియేష‌న్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాగ్ వైవిధ్య‌మైన పాత్ర‌ను పోషించి న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ వీక్షించాల్సిన చిత్ర‌మిదని.. ఇలాంటి మంచి క‌థా చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌క నిర్మాత‌ను కొనియాడారు.. అలాగే టాలీవుడ్‌లో ఇలాంటి చిత్రాలు మ‌రెన్నో రావాల‌ని ఆకాంక్షించి..ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారుMegastar .

ఈ నేప‌థ్యంలో సినీ కార్మికుల గురించి మాట్లాడుతూ.. గ‌తేడాది క‌రోనా క్రైసిస్ వ‌ల్ల క‌రోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికుల‌కు సాయం అందించాం. అందులో ఇంకొంత మిగిలి ఉంది..దానితో సినీ కార్మికుల‌కు, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు క‌రోనా వ్యాక్సిన్ ఇప్పించాల‌నే ఆలోచ‌న మాకు వ‌చ్చింది.. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని తెలిపారుMegastar.