ఉగాదికి మజాకా

సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని రాజేష్ దండ నిర్మించారు. ఫిబ్రవరి 26న రిలీజ్ అయిన ఈ చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నవ్వుల బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది.

సందీప్ కిషన్ రీసెంట్ ఎంటర్టైనర్ ‘మజాకా’ జీ5లోకి రాబోతోంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రం మార్చి 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో జీ5 వీక్షకులు ఉగాది నవ్వుల బ్లాక్ బస్టర్‌తో జరుపుకోబోతోన్నారు. ఆల్రెడీ జీ5లో రీసెంట్‌గానే సంక్రాంతికి వస్తున్నాం, మ్యాక్స్, కుడుంబస్తన్ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా దూసుకుపోతోన్నాయి.

ప్రస్తుతం జీ5లో సంక్రాంతికి వస్తున్నాం, మ్యాక్స్, కుడుంబస్తన్ వంటి చిత్రాలు టాప్‌లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఉగాది సందర్భంగా ‘మజాకా’ రాకతో వినోదం రెట్టింపు కానుంది. నవ్వుల బ్లాక్ బస్టర్‌ను చూసి ఈ ఉగాదికి అందరూ ఎంజాయ్ చేయండి.