మత్తు వదలరా టీజర్‌ను విడుదల చేసిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్!

కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో వచ్చే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ నమ్మకంతోనే మరో యంగ్ టాలెంటెడ్ టీమ్ మత్తు వదలరా అంటూ వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దిగ్గజం ఎమ్.ఎమ్.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతుండగా, కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. రితేష్ దర్శకుడిగా అరంగ్రేటం చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూమీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యంగ్‌టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయగా, ఈ చిత్ర టీజర్‌ను నేడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సాహించాలనే వుద్దేశంతో నిర్మించిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో చిత్రం వుంటుంది. హాస్యంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం ద్వారా ఎంతో మంది నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
శ్రీసింహా, నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
— కథ, దర్శకత్వం: రితేష్ రానా,
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్- క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్,
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత,
సంగీతం: కాలభైరవ,
డి.ఓ.పి: సురేష్ సారంగం,
ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్. ప్రకాశ్,
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్,
స్టంట్ కో-ఆర్డినేటర్: శంకర్ ఉయ్యాల,
క్రియేటివ్ హెడ్: థోమస్ జై,
కో-రైటర్: తేజ.ఆర్,
లిరిక్స్: రాకేందుమౌళి,
కొరియోగ్రాఫర్: యశ్వంత్,
స్టయిలింగ్: తేజ.ఆర్,
లైన్ ప్రొడ్యూసర్: పి.టి. గిరిధర్ రావు,
పబ్లిసిటీ డిజైనర్: ది రవెంజర్జ్,
పి.ఆర్.ఓ: మధు మడూరి.