విజయ్ చరిత్ర తిరగరాశాడు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ దీనిని తెరకెక్కించగా.. ఇప్పటికే విడుదలైన మాస్టర్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న సినిమా టీజర్‌గా నిలిచింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

master vijay pre bussiness
master vijay pre bussiness

ఈ క్రమంలో మాస్టర్ సినిమా విడుదలకే ముందే భారీ బిజినెస్‌ జరుగుతోంది. తమిళంలో ఈ సినిమాను ఏకంగా రూ.65 కోట్లకు కొనుగోలు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల బిజినెస్ చేసింది. కేరళ, కర్ణాటక కలిసి మరో రూ.10 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఉత్తర భారతంలో ఐదు కోట్ల బిజినెస్ చేయగా.. ఓవర్సీస్‌లో రూ.15 కోట్ల బిజినెస్ చేసింది.

వీటితో కలిపి మొత్తం రూ.105 కోట్ల బిజినెస్ చేసింది. కరోనా టైమ్‌లో ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరగడం గ్రేట్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక తమిళనాడులో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడంతో. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.