‘మాస్టర్’ టీజర్ సంచలన రికార్డు

విజయ్ తలపతి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘మాస్టర్’ సినిమా విడుదలకే ముందే రికార్డులు సృష్టిస్తోంది. గత కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ తాజాగా సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి సౌతిండియా సినిమా టీజర్‌గా రికార్డు నమోదు చేసింది. గతంలో విజయ్ హీరోగా వచ్చిన ‘బిగిల్’ సినిమా టీజర్ 50 మిలియన్ల వ్యూస్ సాధించింది. దీంతో యూట్యూబ్‌లో రెండు 50 మిలియన్ల వ్యూస్‌కు పైగా టీజర్‌లు ఉన్న తొలి సౌతిండియా హీరోగా విజయ్ రికార్డు సృష్టించాడు.

master teaser

‘మాస్టర్’ సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల ఆలస్యమైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 1న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశముంది. పాన్ ఇండియా సినిమాగా ఇది రానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు.

తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనుంది. సినిమా రిలీజ్‌కు ముందే మాస్టర్ సినిమా టీజర్ రికార్డు వ్యూస్ సాధించడంతో.. అభిమానుల్లో ఉత్సాహం మరింత ఎక్కువైంది. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ మాస్టర్ టీజర్ ఇంత రికార్డు సృష్టిస్తే.. ఇక సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.