విజయ్ అభిమానులకు ఇక పండగే పండగ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు ‘మాస్టర్’ సినిమా యూనిట్ గుడ్‌న్యూస్ తెలిపింది. ఈ నెల 13న ‘మాస్టర్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో విజయ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

MASTER

ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే విడుదలైన “మాస్టర్’ టీజర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సంపాదించుకుంది. సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సినిమా టీజర్‌గా నిలిచింది. జనవరి 1న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసే అవకాశముంది.

టీజర్‌ రికార్డు సృష్టించడంతో.. ట్రైలర్ ఇంకెన్నీ రికార్డులు సృష్టిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. తొలుత ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఇప్పుడు కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీనిని బట్టి చూస్తే పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కుతోంది.