కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన ‘మాస్టర్’ సినిమా

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు ముందే దీని టీజర్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సంపాదించుకుని రికార్డు సృష్టించగా.. ఇప్పుడు విడుదల అయిన తర్వాత కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల అవ్వగా.. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగాయి.

master collections record

విడుదలైన వారానికి రూ.100 క్లబ్‌లోకి చేరగా.. ప్రస్తుతం దీని కలెక్షన్లు రూ.120 కోట్లకు పైగా ఉన్నాయి. దీంతో వీకెండ్‌లో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.