ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ పైకి…

క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి త‌గ్గుతుండ‌టంతో.. సినిమా ఇండ‌స్ట్రీ మ‌ళ్లీ కుదుట‌ప‌డుతూ తిరిగి షూటింగ్స్ మొదలవుతున్నాయి. లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ధ్య‌లో ఆగిపోయిన సినిమాలనీ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఇప్ప‌టికే ఆర్ ఆర్ ఆర్ చేరగా, త్వరలో ఆచార్య కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. డిలే అయిన ప్రాజెక్ట్స్ ని ప్రొడ్యూస‌ర్లు వీలైనంత త్వ‌ర‌గా వాటిని ప‌ట్టాలెక్కించే ప‌నిలోప‌డ్డారు. ఈ క్ర‌మంలో మాస్ మ‌హారాజా రవితేజ ఖిలాడి గురించిన అప్డేట్ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ర‌మేష్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ‌త‌ మే 29న విడుద‌ల కావాల్సి ఉండగా క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోవ‌డంతో పాటు థియేట‌ర్లు కూడా మూత‌బ‌డడంతో విడుదల ఆగిపోయింది. ఖిలాడి సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతానికిపైగా కంప్లీట్ అయ్యింది. బాలన్స్ పార్ట్ ని జులై 1 నుంచి ప్రారంభిస్తున్నారు. బాలన్స్ ఉన్న ఖిలాడి షూట్ చేస్తూనే శరత్ మండవతో చేస్తున్న థ్రిల్లర్ మూవీని కూడా రవితేజ జూలై 1నే సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి సిద్దమయ్యాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ మూవీలో రవితేజ పక్కన మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.