ఆ మూవీ చేసి ఉంటే రవితేజ మార్కెట్ పెరిగేది…

క్రాక్ తో సూపర్ హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్లో ఖిలాడీ మూవీ చేస్తున్నాడు. రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటిని క్లియర్ చేస్తూ ఖిలాడీ ఇన్ థియేటర్స్ ఓన్లీ అని మేకర్స్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఖిలాడీ విషయం కాసేపు పక్కన పెడితే రవితేజ ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఒక సినిమాలో నటించే ఛాన్స్ వదులుకున్నాడట.

2018లో ధనుశ్, ఐశ్వర్యా రాజేశ్‌, ఆండ్రియా, సముద్రఖని కలయికలో వడ చెన్నై అనే మూవీ బయటకి వచ్చింది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నార్త్ చెన్నై గొడవల చుట్టూ జరిగిన రియల్ స్టోరీ. క్రిటికల్లీ అక్లైమేడ్ మూవీగా పేరు తెచ్చుకున్న వడ చెన్నైలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో రవితేజ నటించాల్సి ఉంది. వెట్రిమారన్ ఫస్ట్ ఛాయస్ అయిన రవితేజ, ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ మూవీ చేయడం కుదరలేదు. ఈ మూవీ చేసి ఉంటే రవితేజకి కోలీవుడ్ లో మంచి మార్కెట్ వచ్చేది.