మాస్ మహారాజా రవితేజ ‘ఈగిల్’ మోస్ట్ స్టైలిష్ రిలీజ్ ట్రైలర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ఈగిల్’ మోస్ట్ స్టైలిష్ రిలీజ్ ట్రైలర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ఈగిల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్ ని ఈరోజు విడుదల చేశారు.

దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ, హరీష్ శంకర్‌లతో కూడిన ట్వీట్ల థ్రెడ్‌తో మేకర్స్ ఉదయం నుండి దీని కోసం చాలా ఆసక్తిని పెంచారు.

రిలీజ్ ట్రైలర్ రవితేజ ఫెరోషియస్ అవతార్‌ను ప్రజెంట్ చేసింది. టెర్రిఫిక్ డైలాగ్‌లు, దావ్‌జాంద్ అద్భుతమైన బిజిఎమ్ తో అదరగొట్టింది. టేకింగ్ టాప్ క్లాస్ గా వుంది. ప్రొడక్షన్ డిజైన్ చాలా లావిష్ గా వుంది.  

‘వచ్చాడంటే మోతర, విధ్వంసాల జాతర’ అనే లైన్స్ సినిమాలోని మాస్ మహారాజా పాత్రను వివరిస్తూ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ ని ప్రామిస్ చేస్తున్నాయి.  

రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. విడుదలకు ముందు అభిమానులకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఈగల్ ఫిబ్రవరి 9న  ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది.

తారాగణం: రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర

సాంకేతిక విభాగం:
ఎడిటింగ్, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
రచన: కార్తీక్ ఘట్టమనేని, మణిబాబు కరణం
సంగీతం: డేవ్ జాంద్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా
పీఆర్వో : వంశీ-శేఖర్