మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ స్టైలిష్ అండ్ గ్రిప్పింగ్ టీజర్ విడుదల

మంచి క్రైమ్ థ్రిల్లర్‌ ని చూడటం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తాం. థ్రిల్లర్స్ మెదడుకు కూడా పదును పెడతాయి. మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’తో మొదటిసారి పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌ ని ప్రయత్నించారు. థ్రిల్లర్ జానర్‌ లో సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. టైటిల్ తోనే క్యురియాసిటీ సృష్టించి, హీరోలు లేరనే ట్యాగ్‌లైన్ తో రవితేజ మంచివాడా, చెడ్డవాడా? అనే ఆసక్తిని మరింత పెంచింది.

మేకర్స్ ఈ రోజు టీజర్‌ తో ముందుకు వచ్చారు. టీజర్ రవితేజను మల్టీ షేడెడ్ క్యారెక్టర్‌ లో ప్రజంట్ చేసింది. ఒక నేరస్థుడు ఒక అమ్మాయిని వెంబడించడంతో టీజర్ ప్రారంభమవుతుంది. తర్వాత ఫ్రేమ్‌ లో ఒక అమ్మాయి శరీరం మొత్తం రక్తంతో విగతజీవిగా పడి ఉన్నట్లు చూపిస్తుంది.“ప్రతి క్రిమినల్ వాడు చేసిన క్రైమ్ మీద వాడి సంతకం వదిలేసి వెళ్లిపోతాడు… ఆ సంతకం కోసం వెతకండి…”అంటూ హత్య కేసును ఛేదించే అధికారిగా పాత్రలో జయరామ్ చెప్పిన డైలాగ్ మరింత క్యూరియాసిటీని పెంచింది.

రవితేజ లాయర్‌ గా పరిచయం అయ్యారు కానీ డిఫరెంట్ షాట్స్ పాత్రలో యూనిక్ నెస్ ప్రజంట్ చేస్తోంది. ఈవిల్ స్మైల్ ఇవ్వడం, ఫెరోషియస్ గా చూడటం, యాక్షన్ లోకి వచ్చినప్పుడు గర్జించడం ఆసక్తికరంగా వున్నాయి. చివరగా సుశాంత్ పరిచయం అయ్యాడు. “సీత ని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు… ఈ రావణాసురుణ్ణి దాటి వెళ్లాలి…” అంటూ రవితేజ వార్నింగ్ ఇచ్చారు.

రవితేజ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. తన ఎక్స్ టార్డినరీ పెర్ఫార్మెన్స్ తో అలరించారు.రవితేజ ఎనర్జీకి మారుపేరు. రావణాసురుడిగా నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తెరపై రవితేజని అలా చూడటం కనువిందుగా వుంది. టీజర్‌ లో సుశాంత్ లిమిటెడ్ స్క్రీన్ టైం పొందినప్పటికీ తన ఇంపాక్ట్ చూపాడు. జయరామ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌ గా ఆకట్టుకున్నారు.

సుధీర్ వర్మ మాస్టర్ క్రాఫ్ట్ మాన్. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ లో రవితేజ పాత్రను అతను ప్రజంట్ చేసిన విధానం ఊహాతీతంగా వుంది. రవితేజ సరికొత్తగా కనిపించారు. కేవలం టీజర్‌ తోనే దర్శకుడు, హీరో ద్వయం మనల్ని అబ్బురపరిచారు.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి యూనిక్ కథను అందించారు. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం అద్భుతంగా వుంది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదనపు జోష్ తీసుకొచ్చారు. టీజర్ కట్‌ కి నవీన్ నూలి ఎక్స్ లెంట్ వర్క్ చేశారు. ఒక్కో ఫ్రేమ్ ఆసక్తికరంగా వుంది. అభిషేక్ పిక్చర్స్మ్ RT టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు, నిర్మాణ ప్రమాణాలు ఫస్ట్ క్లాస్‌ గా ఉన్నాయి.

అత్యంత స్టైలిష్, గ్రిప్పింగ్ టీజర్‌ తో ఎక్సయిట్ మెంట్ మరింతగా పెరిగిపోయింది. ఏప్రిల్ 7న థియేట్రికల్ విడుదలకు ముందు రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రమోషన్ మెటీరియల్‌ని అందించబోతున్నారు మేకర్స్.

తారాగణం: రవితేజ, సుశాంత్, శ్రీరామ్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ

నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ

బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్

కథ & డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో

డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్

ఎడిటర్: నవీన్ నూలి

ప్రొడక్షన్ డిజైనర్: DRK కిరణ్

సీఈఓ: పోతిని వాసు

మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు

పీఆర్వో: వంశీ-శేఖర్