మాస్ మహరాజా రవితేజ, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు ‘ఖిలాడి’ ఫిబ్రవరి 11న విడుదల

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఖిలాడి సినిమా విడుదల తేదీని గురువారం చిత్రనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌లో సిగరెట్ తాగుతూ మాస్ లుక్కులో రవితేజ కనిపించారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.

ప్రొడక్షన్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి.
బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియెస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ డిఫరెంట్ రోల్‌ను పోషిస్తున్నారు.

ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు : రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్ తదితరులు

సాంకేతిక బృందం

కథ, కథనం, దర్శకత్వం : రమేష్ వర్మ
నిర్మాత : సత్యనారాయణ కోనేరు
బ్యానర్ : ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
ప్రొడక్షన్ : ఏ హవీష్ ప్రొడక్షన్
సమర్పణ : డాక్టర్ జయంతిలాల్ గద
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
స్క్రిప్ట్ కో ఆర్టినేషన్ : పాత్రికేయ
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, అన్బు అరివు
డైలాగ్స్ : శ్రీకాంత్ విస్స, సాగర్
ఎడిటర్ : అమర్ రెడ్డి
లిరిక్స్ : శ్రీ మణి
స్టిల్స్ : సాయి మాగంటి
మేకప్ : ఐ శ్రీనివాసరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మురళీకృష్ణ కొడాలి
ప్రొడక్షన్ హెడ్ : పూర్ణ కండ్రు
పబ్లిసిటీ : రామ్ పెద్దిటి సుధీర్
కో డైరెక్టర్ : పవన్ కేఆర్‌కే
ఆర్ట్ : గంది నందికుడ్కర్
పీఆర్ : వంశీ-శేఖర్