రవితేజ… రామారావు ఆన్ డ్యూటీ

ravi teja new movie title revealed

మాస్ మహారాజ రవితేజ 68వ సినిమాకి ‘రామారావు.. ఆన్ డ్యూటీ’ అనే టైటిల్ కన్ఫర్మ్ అయింది. ఈ సినిమాతో శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. రవితేజ ఎమ్మార్వోగా నిజాయితీ ఉన్న అధికారిగా రవితేజ కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్డేట్స్ లో రవితేజ రెండు చేతులతో సంతకాలు చేస్తున్న స్టిల్స్ సినిమాపై ఇంటరెస్ట్ ని క్రియేట్ చేశాయి. కొత్తగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో రవితేజ హాఫ్ స్లీవ్ షర్ట్, ఫార్మల్ ఫ్యాంట్, గాగుల్స్ తో స్టైలిష్ గా ఉన్నాడు. వెనుక ప్రభుత్వ వాహనం.. వృత్తిలో నిబద్ధతగా ఉంటానంటు చేసిన ప్రమాణ పత్రం, మేజిస్ట్రేట్ కార్యాలయం బోర్డు పోస్టర్ లో కనిపిస్తున్నాయి.

చూస్తుంటే క్రాక్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాక్సాఫీస్ ని రఫ్ఫాడించిన రవితేజ.. ఈసారి గవర్నమెంట్ అధికారిగా మెప్పించి కలెక్షన్స్ రాబట్టేలా ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రవితేజ, దివ్యాంశ మధ్య సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఆర్టీ టీమ్ వర్క్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.