She’s back. She’s unstoppable. She is Shivani Shivaji Roy

2014లో వచ్చిన సెన్సేషనల్ లేడీ ఓరియెంటెడ్ సినిమా మర్దానీ. ఎప్పుడు సాఫ్ట్ రోల్స్ ప్లే చేసే రాణి ముఖర్జీ, మొదటిసారి పోలీస్ పాత్రలో రఫ్ అండ్ టఫ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విమెన్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సస్ కాలేదు కానీ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. రాణి ముఖర్జీనే లీడ్ రోల్ ప్లే చేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో రేప్ అండ్ కాన్సీక్వెన్సెస్ గురించి చూపించబోతున్నారు. మర్దనీ 2 గా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఫస్ట్ పార్ట్ అంత ఇంట్రెస్టింగ్ గా కట్ చేయకపోయినా, మర్దనీ 2లో విషయం ఉంది అనిపించేలా ఈ ట్రైలర్ ని డిజైన్ చేశారు. అప్పటికీ ఇప్పటికీ మేకింగ్ పరంగా చాలా వేరియేషన్ ఉంది. మహిళలను ఎలా ట్రాప్ చేస్తున్నారు? అనేది మర్దనీ 2లో చూపించనున్నారు. శివాని సింగ్ రాయ్ గా రాణి ముఖర్జీ మరోసారి ఆకట్టుకుంది. She’s back. She’s unstoppable. She is Shivani Shivaji Roy అనే ట్యాగ్ లైన్ తో డిసెంబర్ 13న వస్తున్న ఈ సినిమాని గోపి పుత్రన్ డైరెక్ట్ చేస్తుండగా, యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.