యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘మను చరిత్ర’. మేఘా ఆకాష్, ప్రియ వడ్లమాని కథానాయికలుగా నటిస్తున్నారు. భరత్ పెదగాని ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. వరంగల్ నేపథ్యంలో ఇంటెన్స్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. త్వరలోనే విడుదల తేది ప్రకటించనున్నారు నిర్మాతలు.
ప్రొద్దుటూరు టాకీస్ బ్యానర్‌పై నరాల శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తుండగా, రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
తారాగణం:
శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్, సుహాస్, డాలి ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, రఘు, దేవీప్రసాద్, ప్రమోదిని, సంజయ్ స్వరూప్, హర్షిత, గరిమ, లజ్జ శివ, కరణ్, గడ్డం శివ, ప్రదీప్.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: భరత్ పెదగాని
నిర్మాత: నరాల శ్రీనివాస్ రెడ్డి
బ్యానర్: ప్రొద్దుటూరు టాకీస్
మ్యూజిక్: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: ఉపేందర్ రెడ్డి
సాహిత్యం: చంద్రబొసు, సిరాశ్రీ, కేకే
కొరియోగ్రఫీ: చంద్రకిరణ్, భాను
యాక్షన్: ‘రియల్’ సతీష్, నందు, జాషువ
పీఆర్వో: వంశీ- శేఖర్