`మ‌న్మ‌థుడు 2` ఫ్యామిలీతో కింగ్ నాగార్జున‌

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. గ‌త వారం షూటింగ్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
షూటింగ్‌లో చిత్ర యూనిట్ సభ్యుల‌తో క‌లిసి నాగార్జున సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేశారు. “నేను నా మ‌న్మ‌థుడు 2 ఫ్యామిలీ!!! ల‌వింగ్ ఇట్‌“ అనే మెసేజ్‌ను కూడా అందులో ఫోటోతో పాటు పోస్ట్ చేశారు నాగ్‌. ఈ సెల్ఫీలో నాగార్జున‌, ర‌కుల్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ త‌దిత‌రులున్నారు.
ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ఆర్ట్‌ డైరెక్ట‌ర్ రామ‌కృష్ణ అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన ప్ర‌త్యేక‌మైన సెట్‌లో ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. చైత‌న్య భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
న‌టీన‌టులు:

కింగ్ నాగార్జున‌
ర‌కుల్ ప్రీత్ సింగ్‌
ల‌క్ష్మి
వెన్నెల‌కిషోర్‌
రావు ర‌మేష్‌
నాజ‌ర్‌
ఝాన్సీ
దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌
నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌
నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌
మ్యూజిక్: చైత‌న్య భ‌రద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌: ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌
స్క్రీన్‌ప్లే: రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌
ఎడిట‌ర్స్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి
డైలాగ్స్‌: కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌
కాస్ట్యూమ్స్‌: అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని.