హైద‌రాబాద్‌లో కింగ్ నాగార్జున `మ‌న్మ‌థుడు 2` కొత్త షెడ్యూల్‌

Manmadhudu 2

Manmadhudu 2

కింగ్‌, నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. రీసెంట్‌గా నెల‌పాటు పోర్చుగ‌ల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. మ‌న్మ‌థుడు 2 ఇన్‌స్పిరేష‌న్‌తో మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందిస్తున్నారు. నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్ స‌హా న‌టీన‌టులంద‌రూ పాల్గొనగా ఈ సినిమాకు సంబంధించి పోర్చుల్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా పూర్తి చేసింది. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించ‌నున్నారు.

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
కింగ్ నాగార్జున‌
ర‌కుల్ ప్రీత్ సింగ్‌
ల‌క్ష్మి
వెన్నెల‌కిషోర్‌
రావు ర‌మేష్‌
ఝాన్సీ
దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌
నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌
నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌
మ్యూజిక్: చైత‌న్య భ‌రద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌: ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌
స్క్రీన్‌ప్లే: రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌
ఎడిట‌ర్స్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి
డైలాగ్స్‌: కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌
కాస్ట్యూమ్స్‌: అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని.