అక్క డైరెక్షన్‌లో మహేష్ సినిమా?

తన సొంత అక్క అయిన మంజుల డైరెక్షన్‌లో ప్రిన్స్ మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్‌గా ఇంతకుముందు సందీప్ కిషన్ హీరోగా ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాను మంజుల తెరకెక్కించింది. కానీ ఆ సినిమా వచ్చినట్లే ఎవరికీ తెలియదు. ఆ సినిమా డిజాస్టర్‌గా మిగలడంతో తొలి సినిమాతోనే మంజుల డైరెక్టర్‌గా సక్సెస్ కాలేకపోయింది.

దర్శకురాలిగా ఒక్క సినిమా కూడా సక్సెస్ లేకుండా డైరెక్ట్‌గా మహేష్ బాబుతో సినిమా తీయడం అంతే కత్తి మీద సాము లాంటిదే అని చెప్పవచ్చు. అంత ధైర్యం చేసి పెద్దగా అనుభవం లేని తన అక్కతో మహేష్ బాబు సినిమా చేసేందుకు అంగీకరిస్తాడా? అనేది పెద్ద ప్రశ్న..

ఏమో.. సొంత అక్క కాబట్టి మహేష్ బాబు ఏమైనా చేయవచ్చు. సినిమా తీయవచ్చు.. లేకపోతే చేయకపోచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే మంజుల డైరెక్షన్‌లో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడనే ప్రచారం మాత్రం బాగానే జరుగుతుంది. మరి చూద్దా ఏం జరుగుతుందో..