‘మణిరత్నం’ బిగ్ బడ్జెట్ మూవీ ‘పొన్నీయిన్ సెల్వన్’.. లేటెస్ట్ అప్డేట్ !!

సీనియర్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ ‘పొన్నీయిన్ సెల్వన్’ 2019 చివరిలో థాయిలాండ్ అడవుల్లో మొదలైంది. షూటింగ్ స్పీడ్ పెరుగుతున్న సమయంలో సినిమాకు అప్పుడప్పుడు బ్రేకులు పడ్డాయి. అప్పటివరకు కార్తీ, జయం రవి, జయరామ్, అశ్విన్ కక్కమను, రియాజ్ ఖాన్ మరియు ఇతరులతో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ చిత్రీకరించారు. ఇక కరోనావైరస్ మహమ్మారి కారణంగా సినిమాకు మళ్ళీ బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

nniyin Selvan Mani Ratnam New Movie

ఇక గత ఐదు నెలలుగా షూటింగ్ కి దూరంగా ఉన్న చిత్ర బృందం ఇటీవల చెన్నైకి తిరిగి వచ్చి మళ్ళీ షూటింగ్ కోసం ప్రణాళిక వేసింది. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు,అలాగే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగించాల్సిన ఎపిసోడ్స్ ని ఫినిష్ చేసేందుకు శ్రీలంకలో ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తారాగణం మరియు సిబ్బంది ఒక నెల సుదీర్ఘ షెడ్యూల్ కోసం సెప్టెంబర్ 20న ఆ దేశానికి వెళ్లనున్నారు. లంక షెడ్యూల్ తరువాత, బృందం చెన్నైకి తిరిగి వచ్చి ఇక్కడ మిగిలిన పనులను పూర్తి చేసుకోనుంది. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాకు A.R. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సినిమాలో విక్రమ్, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లేఖమి, జయరామ్, లాల్, బాలాజీ శక్తివేల్, నిజాల్గల్ రవి వంటి అగ్ర తారలు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.