Manchu Vishnu: మంచు విష్ణు “మోస‌గాళ్ల” నుంచి స‌రికొత్త అప్‌డేట్‌..

Manchu Vishnu: మంచు విష్ణు న‌టిస్తున్న తాజా చిత్రం మోస‌గాళ్లు.. ఈ సినిమాలో మంచు విష్ణు సిస్ట‌ర్ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు జాఫ్రీ చిన్ ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్ర‌పంచంలోని అతి పెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. Manchu Vishnu ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

manchu mosagallu

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్‌డేట్ వ‌చ్చింది. డ‌బ్బే మ‌న‌ది కుమ్మేస్కో అంటూ సాగే పాట‌ను రేపు ఉద‌యం 10గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారని మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ సునీల్‌శెట్టి ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫిస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఇక ఇందులో యంగ్ హీరో న‌వ‌దీప్‌, సంప‌త్‌రాజ్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌మురళీ, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు న‌టిస్తున్నారు.