Tollywood: సారంగ‌దరియా కోమ‌లికి త‌న నెక్ట్స్ సినిమాలో పాడే అవ‌కాశం: డైలాగ్ కింగ్

Tollywood: కోమ‌లి అంటే ప్రేక్ష‌కుల్లో సారంగ‌ద‌రియా అనే జాన‌ప‌ద సాంగ్ గుర్తుకొస్తుంది. తాజాగా నాగచైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్న‌ ల‌వ్‌స్టోరీ సినిమాలో సారంగ‌ద‌రియా అంటూ సోష‌ల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తుంది. ఈ సినిమాలో సారంగ‌ద‌రియా సాంగ్‌ను ఆమెతో పాడించ‌కుండా.. మంగ్లీతో పాడించేస‌రికి ఇప్పుడు వివాదంలో న‌డుస్తుంది. ఇక నిన్న మంచు విష్ణు న‌టించిన తాజా చిత్రం మోస‌గాళ్లు ప్రీరిలీజ్ వేడుకను ఘ‌నంగా నిర్వ‌హించారు.

mohanbabu

ఈ వేడుక‌కు Tollywood డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి.. మోస‌గాళ్లు టీంకు అభినంద‌న‌లు తెలిపారు. ఈ క్ర‌మంలో ఈ వేడుక‌లో భాగంగా స్టేజ్‌పై ఓ సాంగ్‌ను ఆల‌పించింది కోమ‌లి. దీంతో గాయ‌ని కోమ‌లిని ఎంతో మెచ్చుకున్నారు. త‌న త‌దుప‌రి సినిమాలో పాడే అవ‌కాశం ఇస్తాన‌ని తెలిపారు మోహ‌న్‌బాబు. ఇక Tollywood మోహ‌న్‌బాబు ప్ర‌స్తుతం స‌న్ ఆఫ్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్నారు.‌‌‌