అసెంబ్లీ రౌడీ డేట్ కే సన్నాఫ్ ఇండియా…

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సన్ ఆఫ్ ఇండియా’. పవర్ ఫుల్ పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్న మోహన్ బాబు, ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని మంచు అభిమానులు వెయిట్ చేస్తున్నారు. సన్నాఫ్ ఇండియా అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున అభిమానుల కోసం ఒక స్పెషల్ న్యూస్ బయటకి వచ్చింది. బుర్రకథ ఫేమ్ రైటర్ టర్న్డ్ డైరెక్టర్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ జూన్ 4న రిలీజ్ చేయనున్నారట. మోహన్ బాబు కెరీర్ లో జూన్ 4కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆయన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన ‘అసెంబ్లీ రౌడీ’ విడుదల అయ్యింది ఆ రోజే. సెంటిమెంట్ గా భావించారో లేక అనుకోకుండా జరిగిపోయిందో తెలియదు కానీ జూన్4 తారీకుకే ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ విడుదల చేయడం హైప్ పెంచేలా ఉంది. అప్పట్లో ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాతో కలెక్షన్ల రికార్డులు సృష్టించిన మోహన్ బాబు ఈసారి ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా టీజర్‌తో ఎన్ని యూట్యూబ్ రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24ఫ్రేమ్స్ పతాకాలపై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.