మణిరత్నం మల్టీలింగ్వల్ మూవీలో మోహన్ బాబు…

తెలుగు సినిమాల్లో న‌టుడిగా, నిర్మాత‌గా, కలెక్షన్ కింగ్ గా త‌న‌దైన ముద్ర వేశాడు మోహ‌న్‌బాబు. వ‌య‌సు మీద ప‌డటం.. పెరిగిన అనుభ‌వానికి త‌గిన‌ట్లు పాత్ర‌ల‌ను ఎంచుకోవాల‌నుకోవ‌డంతో మోహ‌న్‌బాబు సినిమాల సంఖ్య ప‌రిమితంగా మారింది. `మ‌హాన‌టి`లో ఎస్‌.వి.రంగారావు పాత్రలో క‌న‌ప‌డ్డ మోహ‌న్‌బాబు మ‌రే సినిమాలోనూ న‌టించ‌లేదు. అయితే ఇప్పుడు ఓహిస్టారిక‌ల్ చిత్రంలో న‌టించ‌బోతున్నాడ‌ట‌. అది కూడా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌టం విశేషం. పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌వ‌ల‌ను భారీ బ‌డ్జెట్‌తో బ‌హుభాషా చిత్రంగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌బోతున్నారు.

ఇండియన్ సినిమా ఇండ‌స్ట్రీ నుంచి ప్ర‌ముఖ న‌టులంద‌రూ ఇందులో న‌టించ‌బోతున్నారు. ఓ కీల‌క పాత్ర కోసం మ‌ణిర‌త్నం మోహ‌న్‌బాబును సంప్ర‌దించ‌గా.. ఆయ‌న న‌టించ‌డానికి ఓకే అన్నార‌ట‌. మల్టిలింగ్వల్ చిత్రం కావ‌డంతో ఎక్కువ మొత్తంలో డేట్స్ కావాల్సి ఉంది. సినిమా చేయ‌డానికి మోహ‌న్‌బాబు ఆస‌క్తిగా ఉన్నాడు కానీ.. సినిమా అగ్రిమెంట్‌పై సంతకం చేయ‌లేదు. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం రానుంది.