
నిన్న రాత్రి తిరుపతిలోని బాకార పేట స్టేషన్ వద్ద మంచు మనోజ్ హల్చల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన అక్కడ మెట్లపై కూర్చుని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈరోజు మంచి మనకు ఒక వీడియో ద్వారా రాత్రి ఏం జరిగిందనేది వివరించడం జరిగింది. తాను ఎటువంటి తప్పు చేయలేదని, ఎవరితో ఎక్కడ మిస్ బిహేవ్ చేయలేదని స్పష్టం చేశారు. అంతే కాక చట్టానికి లోబడి ముందుకు వెళ్లినట్లు చెప్పారు. పోలీసులు సైరంతే వచ్చి రిసార్ట్ లో హంగామా చేసి తనపై చాలా దురుసుగా వ్యవహరించినట్లు మంచి మనోజ్ తెలిపారు. తాము సీఎం దగ్గర నుండి వస్తున్నామని చెప్పి తనను బెదిరించడానికి ప్రయత్నించగా మధ్యలో సీఎం పేర్లు ఎందుకు వచ్చింది అని గట్టిగా అడగడంతో తాము సీఎం బందోబస్తులని వచ్చినట్లు మాట మార్చి సమాధానం చెప్పినట్లు మంచు మనోజ్ తెలిపారు. తాను తన కారులోనే స్టేషన్కు వెళ్లినట్లు, వెళ్ళాక ఎందుకు తనని ఇబ్బంది పెడుతుంటారు అని ఎస్సైని అడగకగా అక్కడినుండి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని చెప్పారు. చివరగా సిఐతో ఫోన్లో జరిగిందంతా చెప్పానని, జరిగిన సంఘటన అంతటికి తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని, తాను ఎటువంటి తప్పు చేయలేదని మంచు మనోజ్ సిఐతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. విద్యార్థులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏమి చేయట్లేదని, తాను విద్యార్థుల కోసం న్యాయం జరిగేలా వాడుతున్నట్లు మంచు మనసు తెలిపారు.