‘చెస్’ ఆటతో బిల్డప్.. పొరపాటు చేసి ట్రోలింగ్ కి గురైన ‘హీరోయిన్’!!

చెస్ బోర్డ్‌లో చెస్ ముక్కలను తప్పుగా ఉంచి, తన తదుపరి కదలికను ప్లాన్ చేసుకొని ఉంచడంతో నటి మల్లికా షెరావత్ ట్రోలింగ్ కి గురయ్యారు. బాలీవుడ్ తారలు ప్రేక్షకుల ఆకర్షించడానికి చేసే కొన్ని పనులు వల్ల సోషల్ మీడియాలో ఈజీగా ట్రోలర్స్ కి ఈజీగా దొరికేస్తారు. ఇక నటి మల్లికా షెరావత్ ఇటీవలి అలాంటి ఒక ప్రయోగన్ని చేసి ట్రోలింగ్ కి గురైంది.

చాలా కాలం నుండి వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ డిఫరెంట్ గా దర్శనమిస్తోంది. ఇక తరచుగా ఆమె స్ఫూర్తిదాయకమైన శీర్షికతో కొన్ని త్రోబాక్ ఫొటోలను పోస్ట్ చేయడాన్ని చూడవచ్చు, ఈసారి ఆమె చెస్ ఆట తప్పుగా ఆడుతూ నెటిజన్స్ చేత విమర్శల పాలైంది. 43 ఏళ్ల ఈ నటి తన ముందు ఉన్న చెస్ బోర్డుతో కూర్చున్న ఫొటోను పోస్ట్ చేసింది, ఆమె దానిని “జాగ్రత్తగా, జాగ్రత్తగా, నా కదలికను ప్లాన్ చేస్తుంది” అననే క్యాప్షన్ ఇచ్చింది. కానీ నెటిజన్ల దృష్టి ఆమె చెస్ బోర్డ్ పై పడింది. ఆట యొక్క ముక్కలు తప్పు పెట్టెల్లో ఉంచి అడ్డంగా బుక్కైంది. కింగ్ మరియు క్వీన్ మధ్యలో ఉండవలసి ఉండగా, వాటిని బోర్డు యొక్క చివరి చివరలో ఉంచారు, తరువాత బిషప్, రూక్ మరియు నైట్ కూడా తప్పు పెట్టెల్లో ఉంచారు. దీంతో ఆమెను ఊహించని విధంగా ట్రోల్ చేస్తున్నారు.