క్వీన్… డెవిల్ కి డబ్బింగ్ చెప్పింది

బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్య రాయ్, దేశవ్యాప్తంగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఈ క్వీన్ ఒక డెవిల్ కి డబ్బింగ్ చెప్పబోతోంది. ఇప్పటి వరకూ స్టార్ హీరోలు మాత్రమే హాలీవుడ్ సినిమాలోని ముఖ్య పాత్రలకి డబ్బింగ్ చెప్పే వారు. రీసెంట్ గా వచ్చిన ది లయన్ కింగ్ కి అయితే కింగ్ ఖాన్ ఏ స్వయంగా డబ్బింగ్ చెప్పాడు, ఈ లిస్ట్ స్టార్ హీరోల లిస్ట్ లో ఇప్పుడు ఐశ్వర్య కూడా చేరిందో. ఇంతకీ రాయ్, ఏ సినిమాలో ఏ పాత్రకి డబ్బింగ్ చెప్తున్నారు అనే కదా మీ డౌట్. వాల్ట్ డిస్నీ నిర్మించిన మాలిఫిసెంట్‌: మిస్ట్ర‌న్ ఆఫ్ ఈవిల్‌ సినిమాకి ఐశ్వర్య డబ్బింగ్ చెప్పనుంది.

హాలీవుడ్ హీరోయిన్ ఎంజెలీనా జోలీ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో ఆమె ఓ దుష్ట‌శ‌క్తి పాత్ర‌లో న‌టిస్తోంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. భారీ బడ్జట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఇండియాలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే హిందీలో ఎంజెలీనా పాత్ర‌కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వ‌ర్యారాయ్ తో డ‌బ్బింగ్ చెప్పించడానికి వాల్ట్ డిస్నీ ప్రయత్నాలు చేసింది. ఐశ్వర్య కూడా డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకోవడంతో పనులు చకచకా అయిపోయాయి. ఇప్పుడు మాలిఫిసెంట్‌: మిస్ట్ర‌న్ ఆఫ్ ఈవిల్‌ హిందీ ట్రైల‌ర్‌ను కూడా చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది. ఇక‌పై త‌న‌లో కోపాన్ని, ద్వేషాన్ని చూస్తారంటూ ఐశ‌ర్య‌రాయ్ డైలాగ్ చెప్పింది. జోచిమ్ రోనింగ్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.