మూడు కోట్లు ఆఫర్ చేసి మరీ ఆ హీరోని గెస్ట్ రోల్ కోసం తీసుకున్నారా?

అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమా ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో అఖిల్ సీక్రెట్ అజెంట్ గా క‌న‌ప‌డబోతున్నాడు. ప్రస్తుతం ప్రిప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మమ్ముట్టిని అప్రోచ్ అయ్యారట. ఇప్పటికీ మలయాళంలో స్టార్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ ఉన్నాడు మమ్ముట్టి. గతంలో ఒక తెలుగు డైరెక్టర్ వెళ్లి కథ చెప్తే, మీ హీరోలకి నన్ను తండ్రిని చేయడానికి తెలుగు దర్శక నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు కానీ ఇప్పట్లో తండ్రి పాత్రలు చేయను అని తేల్చి చెప్పేసాడు. అలాంటి మమ్ముట్టికి ఏకంగా 3 కోట్ల రెమ్యూన‌రేష‌న్ ఆఫ‌ర్ చేసి మరీ సురేందర్ రెడ్డి, ఏజెంట్ లో నటించడానికి ఒప్పించాడని సమాచారం.

Akhil Akkineni flaunts his flashboard abs in 'Agent' second poster: Netizens go gaga | Telugu Movie News - Times of India

మ‌మ్ముట్టి, అఖిల్ లు ఈ సినిమాలో గురు శిష్యులుగా న‌టించ‌బోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అఖిల్ ని మమ్ముట్టి ట్రైన్ చేసే యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఏజెంట్ కి మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని సమాచారం. చాలా కాలంగా తెలుగు తెరకి దూరంగా ఉన్న మమ్ముట్టి, యాత్ర మూవీతో కంబాక్ ఇచ్చి మంచి హిట్ అందుకున్నాడు. మోహన్ లాల్ ఫేస్ అలవాటు అయిన తెలుగు ఆడియన్స్ ని ఏజెంట్ లో మమ్ముట్టి అఖిల్ కాంబినేషన్ కొత్తగా అనిపించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అఖిల్, పూజ హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ పోస్ట్ వర్క్స్ కంప్లీట్ చేసుకోని థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ మూవీతో అఖిల్ అక్కినేని ఫస్ట్ హిట్ కొడతాడు అని అక్కినేని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.