రేపు ‘మేజర్’ అనౌన్స్‌మెంట్

అడవి శేషు ప్రస్తుతం మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ముంబై పేలుళ్లలో వీరమరణం పొందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా… శశికిరణ్ దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మ్మెంట్స్‌పై మహేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

major announcement

తాజాగా ఈ సినిమాకు సంబంధించి అడవి శేషు కీలక ప్రకటన చేశాడు. రేపు ఉదయం 10.45 నిమిషాలకు మేజర్ నుంచి అనౌన్స్‌మెంట్ వస్తుందని ట్విట్టర్‌లో ప్రకటించాడు. అయితే ఆ అనౌన్స్‌మెంట్ ఏంటనేది ప్రకటించలేదు. అది ఏమో ఉంటుందోనని నెజటిన్లు చర్చించుకుంటున్నారు. టీజర్ లేదా విడుదల తేదీని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.