మహేష్‌తో అనిల్ రావిపూడి మరో సినిమా?

సూపర్ స్టార్ మహేష్‌బాబుతో అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ విషయాన్ని సొంతం చేసుకుంది. మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా ఇది నిలిచింది. అంతేకాకుండా మహేష్ సినిమా కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా కూడా పేరు సంపాదించుకుంది. ఇక అనిల్ రావిపూడి ఈ సినిమాతో డైరెక్టర్‌గా మరో సక్సెస్‌ను అందుకున్నాడు.

MAHESHBABU

అయితే మహేష్‌తో కలిసి అనిల్ రావిపూడి మరో సినిమా చేయనున్నాడనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై తాజాగా అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. మహేష్‌తో సినిమా చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, కథ కూడా సిద్ధంగా ఉందన్నాడు. మహేష్ కాల్ చేస్తే వెంటనే ఆయన ఇంట్లోకి వెళ్లి కథ చెబుతానన్నాడు.

మళ్లీ మహేష్ ఎప్పుడూ తనకు అవకాశం ఇస్తారో తెలియదని అనిల్ రావిపూడి చెప్పాడు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలిసి F3 సినిమా అనిల్ తెరకెక్కిస్తుండగా.. డిసెంబర్ 14 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఇయర్ కరోనా వల్ల అందరికీ బ్యాడ్ ఇయర్ కాగా.. అనిల్‌కి మాత్రం మంచి ఇయర్ అని చెప్పవచ్చు. సినిమా కెరీర్‌లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయం సాధించగా.. పర్సనల్ లైఫ్‌లో ఆయన తండ్రి కూడా అయ్యాడు.