Superstar: ఖరీదైన కార్వాన్‌ను కొనుగోలు చేసిన మ‌హేశ్!

Superstar: టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉంటార‌నే విష‌యం తెలిసిందే. మ‌హేశ్ ఒక‌వైపు సినిమాలు చేస్తూ.. మ‌రో వైపు ప్ర‌ముఖ యాడ్స్‌లో చేస్తుంటాడు. టాలీవుడ్‌లో అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకునే హీరోల‌లో ఒక‌రైన మ‌హేశ్‌.. దానికి త‌గ్గ‌ట్టే విలాస‌వంత‌మైన జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా మ‌హేశ్‌బాబు త‌న రేంజ్ త‌గ్గ‌ట్టు అత్యాధునిక కార్వాన్ ను రెడీ చేయించుకున్నాడు.

mahesh carvan

ప్ర‌స్తుతం Superstar మ‌హేశ్ బాబు కార్వాన్‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక ప్ర‌స్తుతం మ‌హేశ్‌బాబు స‌ర్కార్ వారి పాట చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి గీతాగోవిందం ఫేం డైరెక్ట‌ర్ ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తుండ‌గా.. Superstar మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.