Maheshbabu: ఉత్త‌రాఖండ్ దుర్ఘ‌ట‌న‌పై మ‌హేశ్‌బాబు భావోద్వేగ‌మైన‌ ట్వీట్‌..

Maheshbabu: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నాడు. దుబాయ్ లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నిన్న ఆదివారం ఉత్త‌రాఖండ్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై Maheshbabu మ‌హేశ్ స్పందించాడు. ఉత్త‌రాఖండ్‌లోని జోషిమ‌త్‌లో ఆదివారం హిమానీన‌దం విరుచుకుప‌డ‌డంతో ఎంతో మంది మ‌ర‌ణించ‌గా.. దాదాపు 170మంది పైగా గ‌ల్లంత‌య్యారు.

maheshbabu latest

బాధితుల్లో ఎక్కువ మంది ఎన్‌టిపిసి- రిషిగంగా విద్యుత్ ప్లాంట్ల‌లో చేసే ఉద్యోగులు.. దీంతో దేశ‌వ్యాప్తంగా ఈ సంఘ‌ట‌న క‌దిలించింది. జాతీయ విప‌త్తు ప్ర‌తి స్పంద‌న బృందాల‌ను ప్ర‌మాద స్థ‌లంలో మోహ‌రించారు. అలాగే ఆర్మీ జ‌వాన్స్ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌పై Maheshbabu మ‌హేశ్‌బాబు దుబాయ్‌లో జ‌రుగుతున్న త‌న‌ షూటింగ్ నుంచి త‌న ట్విట్ట‌ర్ వేదికగా తెలుపుతూ.. ఉత్త‌రాఖండ్ ప్ర‌జ‌ల‌తో తామంతా అండ‌గా ఉన్నామ‌ని.. ప్ర‌తి ఒక్క‌రు భద్ర‌త‌..శ్రేయ‌స్సు కోసం ప్రార్థిస్తున్నాం, అలాగే స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం మోహ‌రించిన జ‌వాన్ల‌కు వంద‌నాలు అంటూ Maheshbabu మ‌హేశ్‌బాబు ట్వీట్ చేశారు.