Maheshbabu: బోల్డ్ డైరెక్ట‌ర్‌తో మ‌హేశ్‌, త‌మ‌న్నా జోడీగా యాడ్‌‌..

Maheshbabu: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఒక ప‌క్క సినిమాలు చేస్తూ.. మ‌రో వైపు వాణిజ్య రంగానికి సంబంధించిన యాడ్స్‌లో న‌టిస్తుంటాడనే విష‌యం తెలిసిందే. అయితే తాజాగా అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో ఓ యాడ్ రూపొందుతుంది. ఇందులో మ‌హేశ్‌కు జోడీగా మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా న‌టిస్తోంది. క‌మ‌ర్షియ‌ల్ యాడ్ రూపంలో మెస్మైరైజ్ చేయ‌నుంది. హ‌వెల్స్ ఎల‌క్ట్రిక్ బ‌ల్బుల యాడ్‌లో వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్నారు.

mahesh

ఇదిలా ఉంచితే Maheshbabu మ‌హేశ్‌, త‌మ‌న్నా ఇదివ‌ర‌కు ఆగ‌డు చిత్రంలో న‌టించారు. అలాగే మ‌హేశ్ చివ‌రి చిత్రం అయినా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేశ్‌తో త‌మ‌న్నా ఐటెం సాంగ్‌లో మెరిసింది. ఇక మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవ‌లే దుబాయ్ షెడ్యూల్ ను ముగించుకుని.. త‌ర్వాత షెడ్యూల్ గ్యాప్‌లో ఈ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటాడుMaheshbabu .