Superstar: ఒక్క సినిమాతోనే వైష్ణ‌వ్‌, కృతి స్టార్ల్‌గా ఎదిగారు: మ‌హేశ్‌బాబు

Superstar: మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన డెబ్యూ చిత్రం ఉప్పెన‌ పాజిటివ్ టాక్‌తో ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖుల మ‌న‌స్సును దోచేసింది. ఈ సినిమాపై మెగా ఫ్యామిలీ హీరోలే కాకుండా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా ఈ సినిమా చూసి మూవీ టీంకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. రెండు రోజుల కింద‌ట బాల‌కృష్ణ ఈ సినిమా చూసి డైరెక్ట‌ర్‌.. ఈ సినిమాలో న‌టీన‌టుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ఈ సినిమా చూసి మూవీ టీంకు అభినంద‌న‌లు తెలిపారు.

uppena

ట్విట్ట‌ర్‌లో Superstarమ‌హేశ్ తెలుపుతూ.. ఉప్పెన ఓ క్లాసిక్ అని.. బుచ్చిబాబు మీరు ఇండ‌స్ట్రీలో ఓ అరుదైన సినిమా చేశారు. మిమ్మ‌ల్ని చూస్తుంటే గ‌ర్వంగా ఉంది. ఈ సినిమాకు దేవీశ్రీ‌ప్ర‌సాద్ అందించిన సంగీతం హృద‌యానికి తాకింది. అంతలా అద్భుత‌మైన సంగీతం ఇచ్చారు. అలాగే తొలి చిత్రంతోనే అంద‌ర్నీ క‌ట్టిప‌డేసిన వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టిల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నా. ఒక్క సినిమాతోనే వీరిద్ద‌రు స్టార్ల్‌గా మారిపోయారు. ఇలాంటి చిత్రానికి వెన్నంటి నిలిచిన సుకుమార్‌, మైత్రీమూవీ మేక‌ర్స్‌కు హ్యాట్సాఫ్ అని మ‌హేశ్ పేర్కొన్నాడు. ఇక Superstarమ‌హేశ్ ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.