రాముడిగా మహేశ్ బాబు?.. రావణుడిగా హృతిక్ రోషన్?

టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ రామాయణ్ అనే సినిమాను రెండేళ్ల క్రితం ప్రకటించగా.. ఆ తర్వాత దీనిని పక్కన పెట్టారు. అయితే తాజాగా ఈ సినిమాపై అల్లు అరవింద్ మళ్లీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది.

mahesh in ramayan

ఇక రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించనున్నాడట. హనుమాన్‌గా అల్లు అర్జున్ కనిపించనున్నాడట. ఇక సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే పేరు వినిపిస్తోంది. ఈ సినిమాని మామ్ ఫేమ్ రవి ఉద్యవార్, దంగల్ ఫేమ్ నితీష్ తివారీ తెరకెక్కించనున్నారట.