2019లో ట్విట్టర్ ని షేక్ చేసిన సూపర్ స్టార్… తెలుగు నుంచి ‘ఒక్కడు’

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ. షూటింగ్ కంప్లీట్ చేసుకోని, రిలీజ్ కి రెడీ అయ్యే టైం దగ్గరికి వచ్చినా కూడా మహేశ్ ని మహర్షి మాత్రం వదలట్లేదు. మహేశ్ బాబు 25వ సినిమాగా వచ్చిన ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. మంచి మెసేజ్ తో వచ్చిన మహర్షి క్లీన్ హిట్ గా నిలిచింది. 2019 సంవత్సరానికి గాను ట్విట్టర్‌లో అత్యంత ప్రభావితం చేసే అంశాలలో నాలుగో స్థానంలో మహర్షి నిలిచింది. తెలుగు పరంగా మహర్షి టాప్ ప్లేస్ లో ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేసింది.

మహేశ్ మహర్షి తెలుగులో టాప్ ప్లేస్ లో ఉండగా, తల అజిత్ నటించిన విశ్వాసం సినిమా నేషనల్ వైడ్ టాప్ ప్లేస్ లో ఉంది. సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన విశ్వాసం మోస్ట్ ఇన్ఫ్లుఎన్షియల్ ట్యాగ్ గా నిలిచింది. ప్రస్తుతం అజిత్ వాలిమై సినిమాలో నటిస్తున్నాడు. ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్న బాలీవుడ్ సినిమాలని వెనక్కి నెట్టి సౌత్ మూవీ ట్విట్టర్ కి షేక్ చేయడం గొప్ప విషయం.