ఆ హీరోయిన్ తో మహేష్ భట్.. వీడియో లీక్

బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అతను మరణించి రెండు నెలలు పూర్తయినా కూడా అసలు మిస్టరీ వీడలేదు. అయితే ఈ ఘటనలో రియా చక్రవర్తితో పాటు నిర్మాత దర్శకుడు మహేష్ భట్ కి సంబంధాలు ఉన్నట్లు అనేక రకాల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో మహేష్ భట్ కి సంబంధించిన మరొక వీడియో బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది.

16ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జియా ఖాన్ తో మహేష్ భట్ చాలా సన్నిహితంగా ఉండడం అందులో సరికొత్త అనుమానాలకు దారి తీస్తోంది. 2013లోనే ఆమె ముంబైలోని ఒక ప్లాట్ లో అనుమానాస్పధంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పుడు సూరజ్ పంచోలిపై కూడా కేసు నమోదైంది. ఆ తరువాత ఆదిత్య పంచోలి తన పరిచాయలతో డబ్బుతో మ్యానేజ్ చేసి కొడుకును కేసు నుంచి బయటకు తీసుకువచ్చాడని ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు జియా ఖాన్ తో మహేష్ భట్ క్లోజ్ గా ఉన్న వీడియో లీక్ అవ్వడంతో విషయం మరింత వైరల్ గా మారింది.