2020కి మహేశ్ తో ఫన్ మాములుగా ఉండదు… మీరే చూస్తారుగా

సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మొదటిసారి సంక్రాంతి బరిలో దిగుతున్న మహేష్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విలన్ ఇంట్లో నడిచే షెడ్యూల్ కంప్లీట్ కావడం, ఒక చెస్ బోర్డ్ ఫోటోని ట్వీట్ చేసిన అనీల్ రావిపూడి, 2020 సంక్రాంతి సూపర్ ఫన్ గా ఉంటుందని పోస్ట్ చేశాడు. త్వరలో మొదలు కానున్న షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోతే సరిలేరు నీకెవ్వరూ టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మరి ఈ కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ ఛాయలు ఈ మూవీలో ఉంటాయి తెలుస్తుంది. ఒక ఆర్మీ ఆఫీసర్ కర్నూల్ ఫేమస్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో కత్తి పట్టుకోని పోరాడాల్సి వచ్చింది అనేదే సరిలేరు నీకెవ్వరూ సినిమాకి టర్నింగ్ పాయింట్ అని తెలుస్తోంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి కీ రోల్ ప్లే చేస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు.