జనవరి 12న సరిలేరు నాకెవ్వరూ అంటూ మహేశ్ వస్తున్నాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేశ్ మేజర్ అజయ్ గా కనిపిస్తున్న ఈ సినిమాని అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. చిన్న గ్లిమ్ప్స్ తోనే ఘట్టమనేని అభిమానులకి కొత్త జోష్ ఇచ్చిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా కనుకుగా వదిలిన పోస్టర్ లో మహేశ్ మాస్ మహేశ్ ని గుర్తు చేశాడు. బార్డర్ లో గన్ పట్టుకోవాల్సిన అజయ్, కర్నూల్ ఎందుకు వచ్చాడు? కొండారెడ్డి బురుజు దగ్గర గొడ్డలి ఎందుకు పట్టుకున్నాడు అనేది సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది.

sarileru neekevvaru release date

రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న పొంగల్ బరిలో నిలబడబోతోంది. ఈ విషయాన్నీ అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ట్వీట్స్ చేశారు. దీంతో సూపర్ స్టార్ సంక్రాంతికి రావడానికి రెడీ అవుతున్నాడు. 2019 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడి, మహేశ్ ని అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా చూపించబోతున్నాడు. చాలా రోజులుగా మిస్ అవుతున్న మహేశ్ రేంజ్ ఎంటర్టైన్మెంట్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో చూడబోతున్నామని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా చెప్తోంది. నిర్మాతల్లో ఒకరైన అనీల్ సుంకర, సరిలేరు నీకెవ్వరూ సినిమాని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తున్నాడు. మరో నిర్మాత దిల్ రాజు సైలెంట్ గా సాలిడ్ రిలీజ్ కి అవసరమైన మ్యాప్ వేస్తున్నాడు.