వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన మహేష్ , నయన్, దుల్కర్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాకుండా తమిళ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీల్లో కూడా మహేశ్ బాబు గ్లామర్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. మహేశ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే ఎన్నో సినిమాలు నడిచాయి. ఫిమేల్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న మహేశ్, ఓగ్ ఇండియాతో టై అప్ అయ్యి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఓగ్ కాస్ట్యూమ్స్ లో మహేశ్ స్టన్నింగ్ ఫొటోస్ బయటకి వచ్చి ఘట్టమనేని అభిమానులకి ట్రీట్ ఇస్తూ ఉంటాయి. దసరా కొత్త కలెక్షన్స్ తో ఓగ్ ఇండియా కోసం ఫోటో షూట్ చేశారు. ఈ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫరెవర్ యంగ్ లుక్ లో మహేశ్ బాబు సూపర్బ్ గా ఉన్నాడు. ఏజ్ పెరిగే కొద్దీ మహేశ్ బాబు అందం పెరుగుతూనే ఉంది. అల్ట్రా స్టైలిష్ గా ఉన్న సూపర్ స్టార్ ఫొటోస్ ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి.

vogue india cover october 2019

మహేశ్ బాబుతో పాటు ఓగ్ కి మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, లేడీ సూపర్ స్టార్ నయనతారలు కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో కూడా బయటకి వచ్చింది. మిగిలిన ఇద్దరి కన్నా పదేళ్ల పెద్ద అయిన మహేశ్ బాబు, వారిద్దరికన్నా గ్లామర్ గా కనిపించడం విశేషం. ఒకసారి ఈ మెయింటనెన్స్ కి సీక్రెట్ ఏంటి అని అడిగితే మహేశ్, తాను ఎక్కువగా స్ట్రెస్ తీసుకోనని, ఎప్పుడు నవ్వుతూనే ఉంటానని అదే తన గ్లామర్ రహస్యమని చెప్పాడు. నిజానికి మహేశ్ చాలా హెల్తీ ఫుడ్ తింటాడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అదే మహేశ్ గ్లామర్ సీక్రెట్.

మహేశ్ బాబు తర్వాత ఈ ఫొటోస్ లో అందరినీ ఆశ్చర్య పరిచిన మరో విషయం నయనతార. సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ ప్రొమోషన్స్ కూడా దూరంగా ఉండే నయనతార, ఓగ్ కోసం ఫోటో షూట్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఓగ్ ఫోటోషూట్ లో నయన్ ముందెన్నడూ చూడనంత గ్లామర్ గా కనిపిస్తోంది.