మహేశ్ ఖాతాలో మరో ప్రెస్టీజియస్ అవార్డ్

శుక్రవారం నాడు దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్భంగా ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ను హైదరాబాద్ లో చాలా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ఈ అవార్డ్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్‌ అనే నేను’ సినిమాకిగానూ ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్నాడు. మహేష్ బాబు ఈ ఈవెంట్ కి వెళ్లకపోవడంతో నమ్రత అవార్డ్ తీసుకున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి లైఫ్ టైమ్ అచివ్మెంట్ అవార్డు లభించింది. భాగమతి సినిమాలో తన నటనకిగానూ లేడీ సూపర్ స్టార్ అనుష్క బెస్ట్ హీరోయిన్ అవార్డు సొంతం చేసుకుంది. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెర్స్ గా మహానటి కీర్తి సురేష్, కేజీఎఫ్ యష్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. RX100 సినిమాలో నెగటివ్ టచ్ ఉన్న రోల్ ప్లే చేసి యూత్ ని ఆకట్టుకున్న పాయల్ కి, బెస్ట్ డెబ్యూ హీరోయిన్ అవార్డు లభించింది. 2018 బాక్సాఫీస్ షేక్ చేసిన రంగస్థలం సినిమాని డైరెక్ట్ చేసిన సుకుమార్ కి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ వచ్చింది.