‘మదరాసి’ విడుదల తేది ఖరారు

శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘మదరాసి’. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా అద్భుత స్థాయిలో రూపొందుతోంది. ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ యాక్షన్-ప్యాక్డ్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 5న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో శివకార్తికేయన్ ఇంటెన్స్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.  

తన ఇంటన్సీవ్ నెరేటివ్ గ్రిప్పింగ్ స్టొరీ టెల్లింగ్ తో ఆకట్టుకునే ఎఆర్ మురుగదాస్ మదరాసితో సరికొత్త ఎక్సయిటింగ్ యాక్షన్-ప్యాక్డ్ కథను చూపించబోతున్నారు.

ఈ చిత్రంలో రుక్మిణి వసంత్‌ హీరోయిన్ గా నటిస్తోంది. విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామోన్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ కొరియోగ్రఫీని కెవిన్ మాస్టర్, దిలీప్ మాస్టర్ పర్యవేక్షిస్తారు.