
సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో హారిక, సాయి సౌజన్య నిర్మాతలుగా కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్క్వేర్. ఈ చిత్రం గతంలో వచ్చిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ గా మార్చి 28వ తేదీన ప్రేక్షకులు ముందుకు రావడం జరిగింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రూల్స్ పోషిస్తూ వచ్చిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీత దర్శకుడిగా చేయగా తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. మురళీధర్ గౌడ్, ప్రియాంక జవాల్కర్, సునీల్, శుభలేఖ సుధాకర్, విష్ణు, సత్యం రాజేష్, అనుదీప్, ఆంటోనీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
2023 లో వచ్చిన మేడ్చత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం అదే సినిమాలా ముఖ్యంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా రావడం జరిగింది. చిత్రంలో మెయిన్ లీడ్ లో నటించిన ముగ్గురి మిత్రుడు విష్ణు (లడ్డు) మిత్రుడు పెళ్లితో మొదలైన ఈ చిత్రం ఆ తర్వాత అనేక మలుపులు తిరుగుతూ గోవా వెళ్తుంది. అక్కడ వాడికి వచ్చిన సమస్యలు ఏంటి? వారి జీవితాల్లోకి మాక్స్ (సునీల్) ఎలా వస్తారు? లైలా (ప్రియాంక జవాల్కర్) వల్ల వీరి జీవితాలలో ఎటువంటి మలుపులు తిరుగుతాయి? లడ్డుకి పెళ్లి అవుతుందా లేదా? చివరికి ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
చిత్రంలో లీడ్ రూల్స్ గా నటించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ వారి మ్యాడ్ చిత్రంలో ఎటువంటి అల్లరి వేషాలు వేస్తూ నటించారో ఈ చిత్రంలో కూడా అంతే అల్లరి చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఎక్కడ తగ్గకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ నటించడం జరిగింది. సీరియస్ అవుతుందని సిచువేషన్ లో కూడా వారు తమ డైలాగ్స్ ఇంకా కామెడీ టైమింగ్ తో మరింత ఎంటర్టైన్ చేశారు. అంతేకాకుండా చిత్రంలో వీరితోపాటు విష్ణు కూడా ఫుల్ లెన్త్ కనిపిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అలాగే మురళీధర్ గౌడ్ సునీల్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, ప్రియాంక జవాన్కర్, అనుదీప్ తమ టైమింగ్స్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇతర నటీనటులంతా తమ తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ ఈ ఎంటర్టైన్మెంట్ను మరింత పెంచే విధంగా సినిమాకు తోడ్పడ్డారు.
సాంకేతిక విశ్లేషణ :
కళ్యాణ్ శంకర్ తాను ప్రేక్షకులను ఏ విధంగా అయితే ఎంటర్టైన్ చేయాలని కథ రాసుకున్నారు అదేవిధంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అటు దర్శకత్వ జాగ్రత్తలే కాకుండా ఇతర విషయాల్లో కూడా ప్రతిదీ చాలా పర్టికులర్గా ఉన్నట్లు అర్థమవుతుంది. రిచ్ నిర్మాణ విలువలతో ఎక్కడ ఖర్చు తగ్గకుండా ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది. సినిమా అంతట లడ్డుగాని పెళ్లి, జామ చెట్టు సాంగ్స్ హైలెట్గా నిలిచాయి. అంతేకాక సినిమాలో సిచువేషన్ కి తగ్గట్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఇతర టెక్నికల్ విలువలు సినిమాకు మరింత తోడ్పడ్డాయి. సినిమాలో టైమింగ్ ఇంకా డైలాగ్స్ కీలకపాత్ర పోషించాయి. కథ చాలా సింపుల్ అయినప్పటికీ దానిని అమలు చేసే విధానంలో కళ్యాణ్ శంకర్ చాలా జాగ్రత్త పడ్డారు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సినిమాను చాలా స్మూత్ గా తీసుకుని వెళ్లారు. కలరింగ్, కాస్ట్యూమ్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో ఎంతో జాగ్రత్త పడినట్టు తెలుస్తుంది. మొదటి హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అనిపించినప్పటికీ సినిమా మొత్తానికి మంచి ఎంటర్టైన్మెంట్గా నిలిచింది. క్లైమాక్స్ ట్విస్ట్ అసలు ఊహించని విధంగా ఉంది.

ప్లస్ పాయింట్స్ :
కథ, సాంగ్స్, డైలాగ్స్, నటీనటులు నటన
మనస్ పాయింట్స్ :
రెండవ భాగం కొంచెం స్లోగా ఉండటం
సారాంశం :
ప్రేక్షకులు అంతా నువ్వులలో మునిగిపోవడానికి రెండు గంటలు పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉంది.