కృష్ణుడు V/S సైన్స్ కొత్తకోణంలో “మాయోన్”

సినిమా : “మయోన్”
దర్శకత్వం : కిషోర్ ఎన్
నిర్మాత : మామిడాల శ్రీనివాస్ (మూవీ మ్యాక్స్) ,అరుణ్ మోజి మాణిక్యం
మ్యూజిక్ : మాస్ట్రో ఇళయరాజా
నటీ నటులు : సిబిరాజ్, తాన్య రవిచంద్రన్,రాధా రవి, KS రవికుమార్, SA చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్ (బక్స్), హరీష్ పెరడి, అరాష్ షా తదితరులు
డి. ఓ. పి : రాంప్రసాద్
పి. ఆర్. ఓ : మధు వి. ఆర్

“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా .రాధా రవి, KS రవికుమార్, SA చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్ (బక్స్), హరీష్ పెరడి, అరాష్ షా తదితర నటీ, నటులుగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్”. చిత్రాన్ని మూవీమ్యాక్స్ అధినేత, నిర్మాత మామిడాల శ్రీనివాస్ గారు సొంతం చేసుకున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న “మాయోన్” చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో జూలై 7న థియేటర్స్ లలో గ్రాండ్ గా విడుదలైన మైథలాజికల్ మిస్ట్రీ థ్రిల్లర్ చిత్రం “మాయోన్” ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండీ

కథ
పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్‌ వాల్యూస్‌ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌ “మాయోన్”.‘అర్జున్’ (శిబి రాజ్) ఆర్కియాలజిస్ట్. తన సీనియర్ అధికారి దేవరాజ్ హరీష్ పేరడీ)తో చేతులు కలిపి పురాతన వస్తువులను, విగ్రహాలను విదేశాలకి అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఈక్రమంలో విజయానందపురంలో అర్జున రాయలు కాలంలో పునర్నిర్మించబడిన శ్రీ కృష్ణుని ఆలయంలో నిధిని దొంగలించి… విదేశాలకు అమ్మేయాలను కుంటారు. అదే సమయంలో ఆర్కియాలజి డిపార్ట్ మెంట్ లో పనిచేసే సీనియర్ అధికారి వాసుదేవ్ (KS రవికుమార్) … అతని టీమ్ లో పనిచేస్తున్న అంజన (హీరోయిన్ తాన్య రవిచంద్రన్) ఎపిగ్రాఫిస్ట్ గా… మరో ఇద్దరు కలసి అదే ఆలయంలో నిధి కోసం వెతకడం మొదలు పెడతారు. మరి ఆ నిధి దొరికిందా? అర్జున్, దేవారాజ్ కలసి ఆ నిధిని ఏమి చేసారు? అసలు అర్జున్ ఎవరు? వీరిద్దికీ మెయిన్ విలన్ సామ్స్ ఫెరారీ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీ నటుల పనితీరు
హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్ గా చాలా అనుభవం ఉన్న నటుడిగా నటించాడు.,హీరోయిన్ తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేసిందని చెప్పాలి. తాన్య ప్రాధాన్యం వున్న పాత్రలో నటించి మెప్పించింది. సిబిరాజ్.. యాక్షన్ సీన్స్ బాగా చేసాడు. గ్రామ పెద్దగా రాధ రవి పర్వాలేదు అనిపించాడు. దేవరాజ్ పాత్రలో హరీష్ పేరడీ మెప్పించాడు. తనకి ఇష్టమైన నెగిటివ్ షేడ్స్ లో అందరి మన్ననలు అందుకున్నారు. దర్శకుడు KS రవికుమార్ కూడా ప్రాధాన్యం వున్న రోల్ చేసారు.ఇంకా ఇందులో నటించిన వారందరూ తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
గాడ్‌ వెర్సస్‌ సైన్స్‌ మెయిన్‌ థీమ్‌గా మిస్టరీ థ్రిల్లర్‌ గా రూపొందిన మైథలాజికల్ సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి.పురాతన దేవాలయాలు, వాటిలో వున్న నిధి, నిక్షేపాల కోసం ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. కానీ మాయోన్ కథ… కథనాలు వైవిధ్యంగా తెరకెక్కాయి. దర్శకుడు కిశోర్ ఓ డెబ్యూ హీరోను దృష్టిలో పెట్టుకొని అతనికి తగ్గట్టుగా సూట్ అయ్యే కథను ఎంచుకొని ప్రేక్షకుల్లో ఓ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసారు. సినిమా ప్రారంభం అయింది మొదలు… హీరో ఇజాన్ని ఇక్కడా ఎలివేట్ చేయకుండా… కథాను గుణంగా స్క్రీన్ ప్లే రాసుకుని సినిమాను ముందుకు నడిపించాడు. ఫస్ట్ హాఫ్ లో కథను డిటైల్ గా చెప్పడానికి కాస్త సమయం తీసుకున్నా… సెకెండ్ హాఫ్ లో కథనాన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా చేసి సక్సెస్ అయ్యారు..తెలుగులో మూవీ మాక్స్ ఆధినేత మామిడాల శ్రీనివాస్ అతి తక్కువ టైంలో ఎక్కువ ప్రమోషన్స్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు.ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేసిన కిషోర్ మైతలాజికల్ సినిమాను హ్యాండిల్ చేశాడు అంటే చాలా గొప్ప విషయం. ఇంకా అనుభవం ఉంటే ఇంకా బాగా చేసేవాడు. మిస్టరీ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇలాంటి మంచి కథ ఉన్న సినిమా ప్రేక్షకులకు అందరికీ రీచ్ అవ్వాలని ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు . ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. హై టెక్నికల్‌ వాల్యూస్‌ తో రూపొందిన ఈ చిత్రానికి ఫోటోగ్రాఫీ స్పెష్ ఎస్సెట్ గా నిలుస్తుంది.మ్యాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన పాటలు చాలా బాగున్నాయి . దర్శక, నిర్మాతలు ఈ కథపై ఎంతో వర్క్ చేసి కష్టపడి సినిమాను నిర్మించారు. .అలాగే ఇలాంటి హిస్టారికల్ సినిమాలను సపోర్ట్ చేస్తూ అఖండ డి. ఓ. పి రాం ప్రసాద్ “మాయోన్” చిత్రాన్ని సెల్యూలాయిడ్ వండర్ గా మలిచారు.తెలుగు లో రిలీజ్ చేస్తున్న నిర్మాత మామిడాల శ్రీనివాస్ చాలా పద్దతిగా వెళ్లే మనిషి. మూవీ మాక్స్ ద్వారా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తూ చిన్న సినిమాలను సపోర్ట్ గా నిలబడతాడు. మైథలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజువల్స్ ఎక్స్ పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆ విజువల్స్ ఎక్స్ పీరియన్స్ ను థియేటర్స్ లలో ఫుల్ స్క్రీన్ పై చూస్తేనే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ మైతలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ “మాయోన్” “కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది అని చెప్పగలను.