
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. వేసవిలో ఈ చిత్రం థియేటర్లో సందడి చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రామచంద్రుడే’ అంటూ కొనసాగే ఓ బ్యూటిఫుల్ పెళ్లి సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. హీరో, హీరోయిన్‌పై అందమైన విజువల్స్‌తో మోస్ట్ బ్యూటిఫుల్‌గా చిత్రీకరించిన ఈ పెళ్లి సాంగ్‌కు శ్రీ హర్ష ఈమని, పార్థు సన్నిధిరాజు సాహిత్యం అందించగా, టిప్పు అండ్ హరిణి టిప్పు ఈ సాంగ్‌ను పాడారు. రథన్ ఈ పాటకు ఎంతో ప్లెజెంట్ సంగీతాన్నిఅందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ… ”ఈ పెళ్లి పాట తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో వచ్చిన ఉత్తమమైన పెళ్లి పాటల్లో తప్పకుండా మా రామచంద్రుడే సాంగ్ కూడా ముందు వరుసలో ఉంటుంది. రథన్ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఈ పెళ్లి పాట అందరికి ఎంతగానో నచ్చుతుంది” అన్నారు.
నిర్మాత హరీష్ మాట్లాడుతూ… ”ఈ సినిమా చేసిన నా టెక్నిషియన్స్, ఆర్టిస్ట్‌లు ఎంతో సపోర్ట్ చేసి మంచి ప్రొడక్ట్‌ను తీసుకొచ్చారు. బెస్ట్ క్వాలిటీ సినిమా ఇవ్వబోతున్నాం. పూర్తి ఎంటర్టైనింగ్గా రాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తాం” అన్నారు.
ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. మణికందన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతాన్నిసమాకూరుస్తున్నాడు. బ్రహ్మా కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సుహాస్, మాళవిక మనోజ్, అనిత హస్సానందిని, అలీ, రవీందర్, విజయ్ , బబ్లూ, పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: భవిన్.ఎమ్.షా