Lovestory: ల‌వ్‌స్టోరి నుంచి రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేసిన మ‌హేశ్!

Lovestory: నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్లవి జంట‌గా తెర‌కెక్కుతున్న చిత్రం ల‌వ్‌స్టోరి. ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో.. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కె. నారాయ‌ణ‌దాస్ నారంగ్‌, పి. రామ్మోహ‌న్ రావు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన సారంగ‌ద‌రియా సాంగ్ యూట్యూట్‌లో ట్రెండింగ్‌లో రికార్డు సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని ఏవో ఏవో క‌లలే సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

ఈ మేర‌కు మ‌హేశ్ బాబు త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ సాంగ్‌ను రిలీజ్ చేసారు. ల‌వ్‌స్టోరీ నుంచి యూత్‌ఫుల్ సాంగ్ రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంద‌ని తెలుపుతూ ల‌వ్‌స్టోరీ చిత్ర‌బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు మ‌హేశ్‌. ఇక ఈ సాంగ్‌ను జోనిత గాంధీ, న‌కుల్ అభ్యంక‌ర్ ఆల‌పించ‌గా.. భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్ లిరిక్స్ అందించారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 16వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.‌